క్రిష్..అహం బ్రహ్మాస్మి

222
Krish says Aham Brahmasmi
- Advertisement -

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి” వంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు క్రిష్. గౌతమి పుత్ర శాతకర్ణి’ ఘన విజయం తరువాత, క్రిష్ మరో చారిత్రక చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా మణికర్ణిక మూవీ పట్టాలపై ఉండగానే తన నెక్ట్స్ ప్రాజెక్టును ప్రకటించేశాడు క్రిష్‌.

అహం బ్రహ్మాస్మి మూవీతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. ఇప్పటికే కథను సిద్ధం చేసుకున్న ఈ క్రేజీ డైరెక్టర్ ఆగస్టులో సినిమాను ప్రారంభించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఉన్నతమైన సాంకేతిక విలువలతో కూడిన ఈ మూవీని రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే, హీరో ఎవరన్నది మాత్రం ఇప్పటికి సస్పెన్సే.

Krish says Aham Brahmasmi

శాతకర్ణితో బాలయ్యకు కొత్త ఇన్నింగ్స్ ప్రసాదించిన క్రిష్.. ఈసారి ఎవ్వర్ని చేతికి తీసుకుంటారు.. వాళ్ళ మార్కెట్ రేంజ్ ని ఏ మేరకు పెంచుతారన్నది టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. ఇక  ప్రస్తుతం క్రిష్ తెరకెక్కిస్తున్న మణికర్ణిక ఏప్రిల్ 27న సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -