వివాదంలో క్రిష్ … ‘మణికర్ణిక’

210
krish manikarnika lands into controversy
- Advertisement -

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి” వంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు క్రిష్. గౌతమి పుత్ర శాతకర్ణి’ ఘన విజయం తరువాత, క్రిష్ మరో చారిత్రక చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ జీవిత చరిత్రను తెరకెక్కించడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేసుకున్నాడు. ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ అసలు పేరు ‘మణికర్ణిక’ కావడంతో అదేపేరును టైటిల్‌గా ఖరారు చేసుకున్నాడు క్రిష్.

ఈ సినిమాలో  కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్ లోగో బయటికి వచ్చిన తరువాత వివాదం చెలరేగింది. తాను 2015లోనే ‘రాణి ఆఫ్ ఝాన్సీ’ కథను గురించి కంగనాతో మాట్లాడాననీ, అప్పుడు ఆమె ఈ సినిమా చేయడానికి అంగీకారాన్ని తెలిపిందని దర్శకుడు కేతన్ మెహతా అన్నారు. ఇప్పుడు అదే కథలో మరో దర్శకుడితో కలిసి పనిచేయడానికి కంగనా రెడీ అవుతుందంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో చూడాలి.

ఇది ఇలా ఉండగా జీ స్టూడియోస్ సమర్పణలో కమల్ జైన్ ఈ చిత్రాన్ని కైరోస్ కంటెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథ-స్క్రీన్ ప్లే సమకూర్చుతున్న ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్ త్రయం సంగీత దర్శకత్వం వహించనున్నారు. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది..  ఏప్రిల్ 27, 2018 విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -