యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఈ సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 19న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో యాంకర్ ప్రదీప్, అనసూయ బిగ్ టికెట్‌ను విడుదల చేశారు. కె.ఎస్.రామారావు, రైటర్ కోన వెంకట్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా…
నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘గుడ్ సినిమాస్ బ్యానర్‌పై శ్రేయాస్ శ్రీను చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అయితే మరిన్ని ఎంటర్‌టైనింగ్ సినిమాలు వస్తాయి. సినిమా పెద్ద హిట్ కావాలని, సినిమాలో నటించిన క్రేజీ అంకుల్స్ అందరూ ఫుల్ బిజీ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ‘‘గుడ్ సినిమా అని చెప్పి, శ్రేయాస్ శ్రీనివాస్ క్రేజీ సినిమాలు తీస్తున్నారు. సినిమాను చాలా క్రేజీగా తీసినట్లు అనిపిస్తుంది. సినిమా సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ ‘‘నాకు ఎంతో కావాల్సిన అతి కొంత మందిలో శ్రీను ఒకడు. తనతో పాటు శ్రీవాస్, రాజా, మనో, శ్రీముఖి కాంబినేషన్‌లో రూపొందిన క్రేజీ అంకుల్స్ గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘‘టైటిల్ చూస్తేనే క్రేజీగా అనిపిస్తుంది. శ్రీను భవిష్యత్తులో మంచి సినిమాలు చేసి మంచి ప్లేస్‌కు వెళతాడని భావిస్తున్నాను. ఎక్స్‌ట్రార్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలను చేసిన సత్తిబాబుగారు ఈ సినిమాతో మరోసారి ట్రాక్‌లోకి వస్తారని అనుకుంటున్నాను. శ్రీవాస్ ఈ సినిమాతో ప్రొడక్షన్‌లోకి అడుగు పెట్టారు. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కోసం వర్క్ చేసిన టీమ్ సభ్యులందరూ నాకు చాలా బాగా కావాల్సినవారు. అందరికీ ఈ సినిమా తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ రఘుకుంచె మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో రెండు పాటలు చేశాను. యాబై ఏళ్లు పైబడ్డ అంకుల్స్ సరదాగా ఉన్నప్పుడు, చిల్ అయ్యేటప్పుడు డాన్స్ చేయడానికని ఓ సాంగ్‌ను కూడా కంపోజ్ చేశాను. లాక్‌డౌన్ సమయంలో వాట్సప్‌ల ద్వారానే మాట్లాడుకుంటూ పాటలను పూర్తి చేశాం’’ అన్నారు.
బొడ్డు అశోక్ మాట్లాడుతూ ‘‘శ్రీను, శ్రీవాస్‌గారు ముందుండి మా సినిమాను చక్కగా పూర్తయ్యేలా చూసుకున్నారు. శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర ఇలా అందరూ సినిమాలో అద్భుతంగా నటించారు. ఆగస్ట్ 19న సినిమా విడుదలవుతుంది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని, శ్రీను పెద్ద నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.బొడ్డు ఆదిత్య మాట్లాడుతూ ‘‘క్రేజీ అంకుల్స్ సినిమా చాలా బాగా వచ్చింది. ఆగస్ట్ 19న విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అన్నారు. రాజా రవీంద్ర మాట్లాడుతూ ‘‘శ్రేయాస్ శ్రీను, ఆదిత్యగారు, ఆనంద్ వీళ్లు క్రేజీ అంకుల్స్‌ను పెద్ద సినిమాస్టైల్లో ప్రమోట్ చేస్తున్నారు. పెద్దగా రిలీజ్ చేస్తున్నారు. శ్రీవాస్‌గారు ఈ సినిమాలో నాకు మంచి అవకాశాన్ని అందించారు. శ్రీముఖిగారు..చక్కగా యాక్ట్ చేశారు. మనోగారు నాకు బ్రదర్‌లాంటివారు. ఆయనతో కలిసి నటించడం హ్యాపీ. భరణి మరో అంకుల్ పాత్రలో నటించాడు. మేం ముగ్గురం ప్రేక్షకులను ఆగస్ట్ 19న నవ్విస్తాం’’ అన్నారు.
మనో మాట్లాడుతూ ‘‘రాజా రవీంద్రతో కలిసి యాక్ట్ చేయడం హ్యాపీ. చాలా ఎంజాయ్ చేస్తూ నటించాం. శ్రీవాస్‌గారు, శ్రీనుగారు నాకు మంచి వేషం ఇచ్చారు. స్టేజ్‌పై శ్రీముఖిని చూడటానికి, ఈ సినిమాలో పూర్తి భిన్నమైన పాత్రలో నటించింది. ఫుల్ ఎనర్జిటిక్ పాత్రలో నటించారు. సత్తిబాబుగారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. ఆగస్ట్ 19న సినిమా విడుదలవుతుంది. సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అన్నారు.అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ ‘‘శ్రీముఖి, శ్రీవాస్, శ్రేయాస్ శ్రీను వంటి ఫ్రెండ్స్ కోసం ఇక్కడకు వచ్చాను. శ్రీను నిర్మాతగా ఇంకా మంచి సక్సెస్ కావాలి. శ్రీముఖిలో మంచి ఎనర్జీ ఉంటుంది. తనకు ఇదొక కొత్త ప్రారంభం కావాలి. శ్రీవాస్‌గారు, సత్తిబాబుగారు, రాజా రవీంద్రగారు, మనోగారు సహా అందరికీ కంగ్రాట్స్. ఆగస్ట్ 19న నేను సినిమాను థియేటర్స్‌లో ఎంజాయ్ చేయబోతున్నాను’’ అన్నారు.
ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ ‘‘క్రేజీ అంకుల్స్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నాకు పూర్తిగా తెలుసు. శ్రేయాస్ శ్రీనుగారు చేసిన ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి. శ్రీవాస్‌గారికి కూడా కంగ్రాట్స్. మనోగారు, రాజా రవీంద్రగారు సహా ఇతర టీమ్ సభ్యులకు ఆల్ ది బెస్ట్. శ్రీముఖి… మా రాములమ్మ.. తను ఎనర్జిటిక్. తనకొక యూనిక్ స్టైల్ ఉంటుంది. తనొక బ్రాండ్. క్రేజీనెస్‌ను అలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఆగస్ట్ 19న థియేటర్స్‌లో కలుద్దాం’’ అన్నారు. శ్రీముఖి మాట్లాడుతూ ‘‘క్రేజీ అంకుల్స్ సినిమాను ముందుగా ఓటీటీ కోసమే రెడీ చేశాం. అయితే ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ కావడంతో ఆగస్ట్ 19న మా సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. శ్రీనుగారు, శ్రీవాస్‌గారు, అశోక్ సహా ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను. సినిమాను సత్తిబాబుగారు చాలా త్వరగా పూర్తి చేశారు. రాజారవీంద్రగారు, మనోగారు, భరణిగారితో కలిసి పనిచేయడం చాలా ఫన్‌గా ఉండింది. రఘుకుంచెగారు చాలా మంచి సంగీతాన్ని అందించారు. ఆగస్ట్ 19న థియేటర్స్‌లో కలుద్దాం’’ అన్నారు.
నిర్మాత శ్రేయాస్ శ్రీను మాట్లాడుతూ ‘‘మా క్రేజీ అంకుల్స్ సినిమాను ఆగస్ట్ 19న విడుదల చేస్తున్నాం. ఈ రిలీజ్‌కు సపోర్ట్ చేస్తున్న గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్, దిల్‌రాజుగారికి స్పెషల్ థాంక్స్. ఓటీటీలో రిలీజ్ చేయాలనే సినిమా చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. దానికి తోడు థియేటర్స్ మళ్లీ పుంజుకోవడంతో సినిమాను ఆగస్ట్ 19న విడుదల చేయాలనుకున్నాం. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.
నిర్మాత శ్రీవాస్ మాట్లాడుతూ ‘‘రాజా రవీంద్ర, మనోగారు, భరణిగారు ముగ్గుర అంకుల్స్‌గా పోటీపడి.. సత్తిబాబుగారిని ఎంకరేజ్ చేస్తూ, సీన్స్‌ను ఇంప్రవైజ్ చేస్తూ, సరదాగా సినిమాను పూర్తి చేశారు. హ్యాపినింగ్ వ్యాపారాలు చేసుకునే ముగ్గురు భర్తలను భార్యలు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందనే పాయింట్‌తో సినిమాను సరదాగా కాన్సెప్ట్‌తో చేశాం. దీనికి శ్రీముఖి గ్లామర్, ఎనర్జీ, పెర్ఫామెన్స్ సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. బండ్ల గణేశ్ రియల్ క్యారెక్టర్‌ను చేశారు. సినిమా ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది. బొడ్డు అశోక్‌గారు సపోర్ట్ దొరకడం మా అదృష్టం. మంచి టీమ్ కుదిరింది. శ్రేయాస్ శ్రీను తనకున్న పరిచయాలతో మంచి టీమ్‌ను అసోసియేట్ చేశాడు. ఇంకా చాలా కథలను సిద్ధంగా పెట్టుకున్నాం. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు. డైరెక్టర్ సత్తిబాబు మాట్లాడుతూ ‘‘మా క్రేజీ అంకుల్స్..రాజా రవీంద్రగారు రాజుగారిగా, మనోగారు రెడ్డిగారిగా, భరణిగారు రావుగారి పాత్రలో కనిపిస్తారు. ఈ ట్రిపుల్ ఆర్ అంకుల్స్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందనేదే ఈ సినిమా. ఈ ముగ్గురితో శ్రీముఖి ఎలాంటి మ్యాచ్ ఆడించిందో తెలుసుకోవాలంటే, ఆగస్ట్ 19న థియేటర్స్‌లో కలుద్దాం’’ అన్నారు.
తారాగణం:
శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి, పోసాని కృష్ణమురళి, అదుర్స్ రఘు, గిరిధర్, హేమ, గాయత్రి భార్గవి, విజయ మూర్తి, వాజ్‌పాయ్, మహేంధ్ర నాథ్, సింధూరి, మధూరి
సాంకేతిక వర్గం:
కథ మాటలు: డార్లింగ్ స్వామి
సినిమాటోగ్రఫి: పి. బాల్‌రెడ్డి
సంగీతం: రఘు కుంచె
ఎడిటర్: నాగేశ్వర రెడ్డి
ఆర్ట్: రఘు కులకర్ణి
పబ్లిసిటి డిజైనర్: ధని ఏలె
స్టిల్స్: పి ఎల్ గణపతి
ప్రొడక్షన్: అడ్డాల శ్రీనివాస్
లైన్ ప్రొడ్యూసర్: ఆనంద్ తాళ్లూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిబాబు వాసిరెడ్డి, గిరిధర్ మామిడిపల్లి
ఫైనాన్స్ డైరెక్టర్: రవి కొమ్మినేని
సమర్పణ: కిరణ్ కె తలసిల
నిర్మాతలు: గుడ్ ఫ్రెండ్స్ & బొడ్డు అశోక్
దర్శకత్వం: ఇ. సత్తిబాబు.