KPHB ఎకరం భూమి @రూ.65.34 కోట్లు

6
- Advertisement -

హైదరాబాద్ కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని ఓపెన్ ఫ్లాట్లకు మరోసారి రికార్డు ధర పలికింది. ఫేజ్ 4లోని భూముల్ని హౌజింగ్ బోర్డు ఆన్‌లైన్‌లో వేలం వేలంవేయడంతో.. ఎకరం భూమిని కొనుగోలు చేసింది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా సంస్థ. దీంతో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల ద్వారా 26 కోట్లు భారీ ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది హౌజింగ్ బోర్డు.

ఈ ప్లాట్‌ కూకట్‌పల్లిలోని ఫేజ్‌-4లో ఉంది. మరోవైపు రాజీవ్‌ స్వగృహ పరిధిలోని బండ్లగూడలో ఉన్న వివిధ టవర్లలోని 159 ఫ్లాట్లకు బుధవారం లాటరీ నిర్వహించారు. ఈ లాటరీ ద్వారా హౌసింగ్‌ బోర్డుకు మరో రూ.26కోట్ల ఆదాయం వచ్చింది. 3 బీహెచ్‌కే (11) ఫ్లాట్లకు దాదాపు 1325 దరఖాస్తులు, 2 బీహెచ్‌కే (19) ఫ్లాట్లకు 525, సింగిల్‌ బెడ్‌ రూమ్‌ (105) ఫ్లాట్లకు 234 దరఖాస్తులు వచ్చాయి.

Also Read:అనర్హత వేటుపై సుప్రీం సంచలన తీర్పు

- Advertisement -