రేవంత్‌వి దొంగ మాటలు:వివేకా

4
- Advertisement -

సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో నన్ను అప్రిషియేట్ చేసింది అని దొంగమాటలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టునట్లు.. సోనియా గాంధీ ఇంట్లో పని చేసే వాడిలాగా మాట్లాడాడు అని దుయ్యబట్టారు.

సోనియా గాంధీ అప్రిషియేట్ చేస్తున్నట్లు ఎక్కడ రాయలేదు.. నేను వేరే పని వల్ల సమావేశానికి రాలేను అని చెప్పింది అన్నారు. ఆ లేఖను చూపెట్టి ప్రజలను మభ్యపెట్టాలని చూశాడని దుయ్యబట్టారు.

నిన్న ఢిల్లీలో బీసీ కులగణనపై మాట్లాడిన సీఎం రేవంత్… సోనియా గాంధీ నన్ను మెచ్చుకుంటూ లేఖ రాసింది అని చెప్పారు. ఇది నాకు ఆస్కార్ అవార్డ్, నోబెల్ బహుమతి, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్… నేను ఎన్ని అభివృద్ధి, సంక్షేమ పనులు చేసినా, వేరే కుర్చీలో కూర్చున్నా, వీటన్నిటికంటే సోనియా గాంధీ రాసిన ఈ లేఖ నాకు గొప్ప అని చెప్పారు రేవంత్.

Also Read:డీలిమిటేషన్‌పై సుప్రీం సంచలన తీర్పు

- Advertisement -