రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గోన్ని మొక్కలు నాటి పర్యవరణంపై అవగహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుల్తాన్ బజార్ సీఐ పద్మ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రిన్సిపల్ విజులత… కోఠి వుమెన్స్ కాలేజ్ ఆవరణలో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌సీ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా విజులత మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 16 కోట్లకు పైగా మొక్కలు నాటడం చాలా గొప్ప విషయమని అన్నారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు వజ్రోత్సవాల సందర్భంగా 75 మొక్కలు నాటామని తెలిపారు. కాలేజ్ లో ప్రతి సంవత్సరం మొక్కలు నాటుతామని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.