కొత్తిమీరతో ప్రయోజనాలు..!

117
- Advertisement -

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు మన చుట్టూ ముడుతూ ఉంటాయి. అయితే అన్నీ రకాల ఆరోగ్య సమస్యలకు తరచూ వైద్యుడిని సంప్రదించడానికి ఇష్టపడరు చాలామంది. అలాంటప్పుడు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు వంటింటి చిట్కాలు చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మనం వంటింట్లో అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి, మెంతులు, మిరియాలు ఇలా ఎన్నో రకాల పదార్థాలను ఉపయోగిస్తూ ఉంటాము. ఇలాంటి వాటిలో మన ఆరోగ్యానికి సరిపోయే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొత్తిమీర ను ప్రతి కూరలోనూ వాడుతూ ఉంటాము.

కొత్తిమీర వేయడం వల్ల వంటల్లో రుచి రెట్టింపు అవుతుంది. అయితే కొత్తిమీర కేవలం వంటల రుచిని పెంచడంతో పాటు మన ఆరోగ్యాన్ని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కొత్తిమీర ఆకులను అలాగే పచ్చిగా తింటే థైరాయిడ్ సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాకుండా షుగర్ వ్యాధి కూడా కంట్రోల్ అవుతుంది. కొత్తిమీర ఆకులను రోజు తినడం వల్ల మూత్ర సమస్యలు కూడా తగ్గిపోతాయట. కొత్తిమీర ఆకులలో ఆల్కలాయిడ్ లు, ఫ్లెవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిత్త రుగ్మతలను తగ్గించడమే కాకుండా కాలేయ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.

అలాగే జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. కొత్తిమీర ఆకులలోనూ, ఖండంలోనూ, గింజలలోనూ సుగంధ తత్వాలతో పాటు ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల జీర్ణ వ్యవస్థలో ఏర్పడే సమస్యలకు కొత్తిమీర ఒక చక్కటి పరిష్కారం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు కొత్తిమీర అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని ఈ మద్య జరిగిన కొన్ని అద్యయానల్లో కూడా రుజువైంది. అందువల్ల ప్రతీరోజు కొత్తిమీర ఆకులను తినడం లేదా కొత్తిమీర కలిగిన వివిద రకాల పనియాలను సేవించడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Also Read:గం..గం..గణేశా…రిలీజ్ డేట్

- Advertisement -