గజ్వేల్‌లో పర్యటించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

184
kotha prabhakar reddy

కరోనా వైరస్ మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గజ్వేల్‌లో పర్యటించారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. గజ్వేల్ సమీకృత మార్కెట్ ను సందర్శించి కరోనా వ్యాధి వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్ధానికులకు వివరించారు. కూరగాయల ధరలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ చాడ కిరణ్ కుమార్ రెడ్డి, సర్పంచ్ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి ,జడ్పీటీసీ పంగ మల్లేశం,దిలాల్పూర్ సర్పంచ్ దయాకర్ రెడ్డి,టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ కి చెందిన బొమ్మ లక్ష్మణ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 10000 ఎంపీకి అందజేశారు.

అనంతరం ప్రజ్ఞపూర్ మున్సిపల్ చైర్మన్ NC రాజమౌళి తండ్రి రాజయ్య మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.