కొత్త కొత్త‌గా డైమండ్ రాణి సాంగ్

82
kotha kothaga
- Advertisement -

అజయ్‌, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, ఆనంద్ (సీనియర్ హీరో), తులసి, కాశీవిశ్వనాద్, కల్యాణి నటరాజన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న చిత్రం కొత్త కొత్త‌గా. బి జి గోవిందరాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్నారు యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి హనుమాన్ వాసంశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలోని డైమండ్ రాణి ..సాంగ్ ను శుక్ర‌వారం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతీ ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. శేఖర్ చంద్ర సంగీతం దర్శకత్వంలో కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి పాడిన డైమండ్ రాణి ..సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల చేసిన కొద్ది సేప‌టికే మంచి స్పంద‌న రావ‌డం విశేషం.

మంచి ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవ‌లే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి విడుద‌ల చేశారు. అలాగే టీజ‌ర్ కూడా మంచి ఆద‌ర‌ణ పొందుతోంది.ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుగుతున్నాయి. ఈ సినిమాను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

న‌టీన‌టులు-
అజయ్
వీర్తి వఘాని
ఆనంద్ (సీనియర్ హీరో)
కాశీ విశ్వనాధ్
తులసి
కల్యాణి నటరాజన్
పవన్ తేజ్
ఈరోజుల్లో సాయి త‌దిత‌రులు.

- Advertisement -