టాలీవుడ్ మరో దిగ్గజాన్ని కొల్పోయింది. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం 4గంటల సమయంలో ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జులై 10న కోట శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. తమిళ, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించిన కోట.. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 2023లో వచ్చిన సువర్ణ సుందరి ఆయన చివరి చిత్రం.
1966లో ఆయనకు రుక్మిణితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 2010జూన్ 21న కోట కుమారుడు ఆంజనేయ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు అకాల మరణంతో ఆయన కుంగిపోయారు. కోట తమ్ముడు శంకర్ రావు కూడా నటుడే. 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు కోట.
Also Read:అశుతోష్ దర్శకత్వంలో రిషబ్!

