Kavitha: తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్

4
- Advertisement -

ఎమ్మెల్సీ కవిత నివాసంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని తేల్చిచెప్పారు ఎమ్మెల్సీ కవిత. ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారు…కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అన్నారు.

కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి… కేసీఆర్ ఒక వేగుచుక్క అన్నారు. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ అన్నారు.కేసీఆర్ పాలనలో నిధులు వరదలయ్యి పారేవి… ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ కవితను కలిశారు అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు. కులగణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందించినందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలియజేశారు. బ్రిటీష్ పాలనలో కూడా లేని చేనేతపై పన్నును ప్రధాని మోదీ జీఎస్టీని విధించడం దౌర్భాగ్యం అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ తరఫున చేనేతపై జీఎస్టీని రీయింబర్స్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం శోచనీయం అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రియింబర్స్ చేయాలని డిమాండ్ చేశారు.

Also Read:రేవంత్ రెడ్డి అపరిచితుడు: హరీశ్‌

- Advertisement -