గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలునాటిన ఎమ్మెల్యే చందర్‌

674
korukanti chander
- Advertisement -

ఎంపి సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ చాలంజ్ కు అపూర్వ స్పందన లభిస్తోంది.రాజకీయ నాయకులతో పాటు కళాకారులు,సామాజిక వేత్తలు సైతం హరిత తెలంగాణలో భాగంగా మొక్కలు నాటుతున్నారు.ఇదే క్రమంలో ఆస్ట్రేలియా కు చెందిన టీఆర్ఎస్ ప్రెసిడెంట్ నరేందర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్వీకరించారు.

పెద్దపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మొక్కలను నాటారు.అనంతరం మరో ఐదుగురికి గ్రీన్ ఛాలెంజ్‌ని విసిరారు.తమిళనాడు మాజీ ఎమ్మెల్యే ch శేఖర్,తుపాకీ రాముడు హీరో బిత్తిరీ సత్తి,సిద్దార్థ సినిమా హీరో RK నాయుడు,రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, అర్జీ-2జియం నారాయణ లకు మొక్కలను నాటాలని సవాల్ విసిరారు. హరితహారం లో భాగంగా కాలుష్యాన్ని తగ్గించి,ప్రాణవాయువు ను అందించే చెట్లను పెంచాలని ఎమ్మెల్యే చందర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -