లైవ్‏‎లో రిపోర్టర్‏కి ముద్దులు పెట్టిన అమ్మాయిలు..

225
- Advertisement -

రష్యా వేదికగా జరుతున్న ఫిఫా వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. ఏ టీం చాంపియన్ గా నిలుస్తుందో అని ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు రష్యాలో ముద్దుల వ్యవహారం మరో హాట్ టాపిక్ గా మారింది. ఈ పోటీలను లైవ్ కవరేట్ ఇవ్వడానికి వచ్చిన మహిళ రిపోర్టర్లకు కొందరు ఆకతాయిలు ముద్దులు పెడుతూ లైంగికంగా వేధిస్తున్న వీడియోలు చూశాం. మేం ఏం తక్కువ కాదు అన్నట్టుగా.. ఇద్దరు రష్యా అమ్మాయిలు ఓ పురుష రిపోర్టర్ ని లైంగికంగా వేధించారు.

fifa-journalist-784x441

దక్షిణ కొరియాకు చెందిన ‘ఎంబీఎన్’ అనే చానల్ రిపోర్టర్ జియాన్ వాంగ్ రియల్, రష్యాలోని ఓ ప్రాంతం నుంచి లైవ్ కార్యక్రమం ఇస్తున్నాడు. సడెన్ గా ఇద్దరు రష్యన్ అమ్మాయిలు వచ్చి.. జియాన్ కు ముద్దులు పెట్టి వెళ్లిపోయారు. ఈ ఘటనతో తడబడిన జియాన్, చిన్నగా నవ్వి తన పని పూర్తి చేసుకున్నాడు.

తమ రిపోర్టర్ ని లైంగికంగా ఇద్దరు రష్యన్ అమ్మాయిలు వేధించారంటూ ‘ఎంబీఎన్’ ఛానెల్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. మరోవైపు ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఓ పురుష రిపోర్టర్ పై లైంగిక దాడి జరిగితే ఎవరూ స్పందిచరెందుకు అంటూ కొందరు కామెంట్లు చేయగా… జియాన్ యుఆర్ లక్కీ బాయ్ అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

https://www.youtube.com/watch?time_continue=26&v=G5VrMmdvAnU

- Advertisement -