వరుణ్..’కోరియన్ కనకరాజు’ గ్లింప్స్‌

1
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ …. దర్శకుడు మెర్లపాక గాంధీతో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్‌లో 15వ చిత్రంగా కాగా వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర బృందం ప్రత్యేక అప్‌డేట్‌ను విడుదల చేయడంతో సినిమా హాట్ టాపిక్‌గా మారింది.

ఈ చిత్రానికి ‘కోరియన్ కనకరాజు’ (KOKA) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్లింప్స్ ప్రారంభంలో సత్య కొరియన్ పోలీసుల చేతిలో అదుపులో ఉండగా, వారు ప్రధాన పాత్ర గురించి ప్రశ్నిస్తారు. ఆ తర్వాత రితికా నాయక్ ఎంటర్ అయి నిజంగా ఏమి జరిగిందో వివరించడం మొదలుపెడుతుంది.

దీంతో వరుణ్ తేజ్ మాస్ ఎంట్రీ వస్తుంది. ధోతీ ధరించి, చేతిలో కటానా ఖడ్గంతో, చేతిపై శివుడి టాటూతో కనిపించిన ఆయన విధ్వంసం సృష్టిస్తాడు. అయితే, వెంటనే కథలో ట్విస్ట్ వస్తుంది. ఇది నిజానికి వరుణ్ తేజ్ కాదు, అతనిలో ప్రవేశించిన ఒక ఆత్మ అని తెలుస్తుంది. ఆ ఆత్మ ఏమిటి? ఎందుకు వరుణ్ తేజ్‌ను ఎంచుకుంది? అన్న విషయాలు ఈ వేసవిలో సినిమా విడుదలైన తర్వాత తెలియనున్నాయి.

ఈ గ్లింప్స్‌లో వరుణ్ తేజ్‌ను ఇప్పటివరకు చూడని మాస్ అవతారంలో చూపించడం ఆయన కెరీర్‌లో కొత్త మలుపుకు సంకేతంగా కనిపిస్తోంది. ఈ కొత్త జానర్‌లో ఆయన ఎలా రాణిస్తారో చూడాల్సి ఉంది. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:థైరాయిడ్..బరువు పెరగడానికి కారణమా?

- Advertisement -