భరత్ అనే నేను సినిమాతో పుల్ సక్సెస్ జోష్ లో ఉన్నారు డైరెక్టర్ కొరటాల శివ. తీసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ కావడంతో టాప్ డైరెక్టర్ల లీస్ట్ లో చేరిపోయాడు. వరుసగా ప్లాప్ లతో సతమతమవుతున్న మహేశ్ బాబుకు రెండు భారీ సినిమాలు ఇచ్చాడు. ఇక తాజాగా వచ్చిన భరత్ అనే నేను సినిమా రూ. 200కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా మహేశ్ బాబు కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలవడం విశేషం. గత కొద్ది రోజులుగా కొరటాల శివ ఎ హిరోతో సినిమా తీస్తాడా అని ఒక పెద్ద సస్పెన్స్ ఉండేది. ఇప్పుడు ఆ సస్పెన్స్ కు తెరలేపాడు కొరటాల శివ.
గతంలో చిరంజివి, అల్లు అర్జున్ తో కొరటాల శివ సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. తన తరువాతి సినిమా చిరంజివితో చేస్తున్నట్టు కూడా తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం. అయితే చిరంజివి ప్రస్తుతం సైరా సినిమాతో బిజిగా ఉండటంతో…ఆ సినిమా విడుదలకు ఇంకో సంవత్సరం సయయం ఉండటంతో అంతలోపు ఇంకో సినిమా చేసేద్దాం అనుకున్నాడు కొరటాల. గత కొద్ది రోజులు కింద నానికి కథ చెప్పిన కొరటాల ఇప్పుడు ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట మన న్యాచురల్ స్టార్ నాని.
వరుస హీట్లతో దూసుకుపోతున్న నానికి..ఇలాంటి టాప్ డైరెక్టర్ తో సినిమా తీస్తే నాని మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నట్లే అని చెప్పుకొవచ్చు. త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు కొరటాల శివ స్నేహితుడు నిర్మాతగా వ్యవహరించున్నాడని సమాచారం.