చైతు నిజంగా గ్రేట్.. కొరటాల శివ

291
Koratala Siva
- Advertisement -

నాగ చైతన్య సమంత జంటగా నటించిన సినిమా ‘మజిలీ’.. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్. ఏప్రిల్ 5 న విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ కాగా నిర్మాతకి మంచి లాభాలను తెచ్చిపెట్టింది.. నాగ చైతన్య కెరీర్ లోనే వసూళ్ల పరంగా ఈ సినిమా ది బెస్ట్ అనిపించుకోగా ఈ సినిమా జైత్రయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది.. అయితే తాజాగా ఈ సినిమా కి సంబంధించి సక్సెస్ మీట్ ని హైదరాబాద్ లో నిర్వహించింది చిత్ర బృందం.. ఈ కార్యక్రమానికి నటులు రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ తో పాటు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, అనిల్ రావిపూడి ముఖ్యఅథిధులు గా విచ్చేశారు.

Koratala Siva

ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. సినిమా ఇంత మంచి సక్సెస్ పొందినందుకు టీం అందరికి శుభాకాంక్షలు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది.. అంత బాగా తీర్చిదిద్దారు దర్శకుడు.. ప్రతి సీన్ చాల బాగుంది.. డైలాగ్స్ పాత్రకు సరిపోయేలా రాశారు.. నిజంగా లోకంలో ఇలానే జరుగుతుందా అని అన్నట్లు తీర్చిదిద్దారు.. చైతన్య మంచి పాత్ర చేశారు.. పోసాని, రావు రమేష్ ఇండస్ట్రీలో ఉండడం అందరి అదృష్టం.. చైతు ఇంత మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారంటే నిజంగా గ్రేట్. పూర్ణ పాత్రను చూస్తుంటే నిజంగా అలాంటి క్యారెక్టర్ ఉందా అనిపిస్తుంది.. సమంత చాలా బాగా చేశారు.. ఆమెతో నేను పనిచేశాను.. గ్రేట్ యాక్టర్.. చైతు , సమంతల కెమిస్ట్రీ చాల బాగుంది.. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇంత తక్కువ టైంలో ఇంత క్వాలిటీ మ్యూజిక్ ఇవ్వడం నిజంగా గ్రేట్.. ప్రొడ్యూసర్స్ మంచి హిట్ కొట్టారు. అన్నారు.

- Advertisement -