డ్రగ్స్ వివాదంపై స్పందించిన కొరటాల..

191
- Advertisement -

గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై దృష్టి పెట్టిన ఆబ్కారీ శాఖ ప్రత్యేక దర్యాప్ట్ బృందాన్ని ఏర్పాటు చేసి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్టు అనుమానమున్న హీరో హీరోయిన్లను, పరిశ్రమలకు చెందిన ఇతర వ్యక్తులను తీవ్ర స్థాయిలో విచారిస్తూ రోజుకో సెన్సేషనల్ న్యూస్ బయటకు తెస్తున్న సంగతి తెల్సిందే. దీనిపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించగా తాజాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ స్పందించారు.

Koratala Siva Responds on Drugs Issue

డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ… సినీ ప్రముఖులు ఒక్కొక్కరు దీనిపై వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వరుస హిట్లతో మాంచి జోష్ మీద ఉన్న దర్శకుడు కొరటాల శివ తాజాగా ఈ అంశంపై స్పందించాడు. అవినీతి భూతాన్ని అంతం చేసేందుకు అన్ని ప్రభుత్వాలు సిట్లను వేయాలని ఆయన ట్విట్టర్ ద్వారా సూచించారు. సమాజానికి అత్యంత ప్రమాదకరమైనది అవినీతి అని అన్నాడు. డ్రగ్స్ కన్నా దీని వల్లే సమాజానికి ఎక్కువ చెడు జరుగుతుందని చెప్పాడు. ప్రభుత్వాలు తలచుకుంటే ఈ పని చేయగలుగుతాయని ప్రభుత్వాలకు విలువైన సలాహా ఇచ్చారు.

https://twitter.com/sivakoratala/status/890870533285228546

- Advertisement -