‘దేవర 2’ ..ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

4
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘దేవ‌ర‌’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె నిర్మించిన ఈ మూవీ సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో బాలీవుడ్ వెర్స‌టైల్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించారు.

ఇప్పటికే ఈ చిత్రం సుమారు రూ. 466 కోట్ల వసూళ్లను రాబట్టింది. పార్టు 1 హిట్ కావవడంతో పార్ట్ 2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పార్ట్ 2కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కొరటాల శివ.

ఫస్ట్ పార్ట్ కంటే దీని సీక్వెల్​ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలిపారు దర్శకుడు శివ. సినిమా చూసే ప్రేక్షకులు సీట్‌ ఎడ్జికి వస్తారు… ఓ డైరెక్టర్​గా నేను పార్ట్‌ 2 విషయంలోనూ ఎంతో నమ్మకంగా, ఆసక్తిగా ఉన్నాను అని చెప్పారు. కథలో అసలు ట్విస్ట్​ పార్ట్‌ 2లోనే ఉందని… ప్రతీ పాత్ర చాలా హై లో ఉంటుందన్నారు. పార్ట్‌1లో మీరు చూసింది 10 శాతం మాత్రమే…సెకండ్ పార్టులో 100శాతం చూస్తారు అని వెల్లడించారు.

Also Read:రాష్ట్రానికి రూ.11 వేల కోట్లు ఇవ్వండి: సీఎం రేవంత్

- Advertisement -