కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి..సీఎం,కేటీఆర్ సంతాపం

54
- Advertisement -

మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల సంతాపాన్ని తెలిపారు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు.

పరిగి నియోజకవర్గం నించి పలు మార్లు ఎమ్మెల్యే గా గెలిచి, ప్రజాభిమానం పొందిన సీనియర్ రాజకీయ నేతగా, ప్రజలకు ఆయన చేసిన సేవలను సీఎం కొనియాడారు. కొప్పుల హరీశ్వర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు.హరీశ్వర్ రెడ్డి కుమారుడు, పరిగి ప్రస్తుత ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన హరీశ్వర్ రెడ్డి పరిగి ప్రాంతానికి ఎంతగానో సేవలు అందించారన్నారు. హరీశ్వర్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కేటీఆర్ ప్రార్థించారు. హరీశ్వర్ రెడ్డి కుమారుడు, ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మహేష్ రెడ్డికి ఆయన కుటుంబానికి తన సంతాపం తెలిపారు.

Also Read:రివ్యూ: రుద్రం కోట

- Advertisement -