సింగరేణి ప్రైవేటికరణకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమై ఉద్యమిస్తామన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్.ఆదివారం కరీంనగర్ తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కొప్పుల… తెలంగాణకే తలమానికంగా నిలిచిన సింగరేణి సంస్థ ఎంతో మందికి ఉపాధి కల్పించిందన్నారు.
సింగరేణిని ప్రైవేట్ పరం చేసే చర్యలు సరికావని…బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లాభాల్లో నడిపించామన్నారు. లాభాల్లో ఉన్న సింగరేణిని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారని ప్రశ్నించారు. నాడు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. నేడు అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపి బొగ్గు గనుల వేలంలో పాల్గొనడం వారి ద్వంద వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
సింగరేణికిలో ప్రైవేట్ సంస్థలు వస్తే రిజర్వేషన్లు పోతాయని…ఫలితంగా కార్మికులు హక్కులు కొల్పోతారన్నారు.
Also Read:తెల్ల వెంట్రుక పీకితే..మరిన్నిపెరుగుతాయా?