క్రిస్మస్ కానుకలతో పాటు విందు: మంత్రి కొప్పుల

1005
koppula eshwar
- Advertisement -

క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈనెల 20న క్రిస్టియన్ లకు ఎల్బి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విందు ఏర్పాట్లను పరిశీలించారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ కనుక లతోపాటు ,విందు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు.

గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తోందని చెప్పారు. గత సంవత్సరం కంటే ఈసారి గొప్పగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని..ఇప్పటికే అనేక సార్లు ఏర్పాట్లపై రివ్యూ మీటింగ్ పెట్టామని చెప్పారు.

కార్యక్రమం విజయవంతం కోసం సీఎం కేసీఆర్ అనేక సూచనలు సలహాలు చేశారని.. ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయని చెప్పారు. భద్రతతోపాటు అన్ని ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం అని వచ్చిన వారికోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

క్రిస్మస్ సందర్భంగా హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ పాల్గొంటారని అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. మంత్రి కొప్పులతో పాటు నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మైనార్టీ శాఖ సలహాదారు ఏకే ఖాన్,క్రిస్టియన్ మైనార్టీ సెక్రటరీ క్రాంతి వెస్లీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -