దివ్యంగులకు చేయుతనిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: మంత్రి

212
- Advertisement -

దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా దివ్యంగులకు పించన్లు, వారి అవసరాలకై వివిధ అధునాతన ఉపకరణాలను అందిస్తున్న ఎకైన రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం దర్మపురి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో దివ్యాంగులకు ఎడిఐపి పథకం క్రింద ధర్మపురి నియోజకవర్గంలోని వికలాంగులకు వివిధ ఉపకరణాల వితరణ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ..మూడు చక్రాలకు శారక వికలాంగులకు శారిక వికాలాంగుల కొరకు మూడు చక్రాల స్కూటీలు (జూపీటుర్), స్పైనల్ కాట్ ఇంజూరి (మస్కిలర్ డిస్ర్టోపి) ఉన్నవారికి బ్యాటరి ఆదారిత వీల్ చైర్, బ్యాటరి ఆపరేటర్ ట్రైసైకిల్, వినికిడి లోపం ఉన్న చదువుకునె విద్యార్థులకు 4జి ఫోన్ లు, అంధ విద్యార్థులకు ల్యాప్టాప్, వినికిడి లోపం ఉన్న చిన్నపిల్లలకు డైసిప్లెయర్లు, సంక కర్రలు, గుడ్డి వారికి కర్రలు అందించడం జరుగింది. 33 రిట్రోపైడ్ వాహనాలు, 33 బ్యాటరి ఆదారిత వీల్ చైర్లు, 12 ల్యాప్ టాప్, 14 జి మోబైల్ ఫోన్ లను అందించడం జరగుతుందని తెలియజేశారు.

అన్ని వర్గాలతో పాటు దివ్యాంగులకు కూడా ముఖ్యమంత్రి సహకారాలను అందిస్తున్నారని, వికాలంగులకు 500 లుగా ఉన్న వికలాంగుల పెన్షన్ 1500 వందలు పెంచారని, ఆతరువాత 3000 పెంచుకున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనని అన్నారు. అంతేకాకుండా వికలాంగుల కొరకు అదునాతమైన పరికరాలు అందించడం జరగుతుందని, స్పింగ్ మోడల్ చంక కర్రలు 3వేల రూపాయలను వెచ్చించి అందించడం జరిగిందని, రెండుకళ్లులేని అందుల కొరకు 2 మీటర్ల ముందు తెలియజేసే విధంగా ఉండే చెతి కర్రను అదించడం జరిగుతుందని, బ్యాటరి ఆదారిత మూడుచక్రాల ట్రైసైకిల్ అందించడం జరుగుతుందని, కార్పోరెషన్ ఋణాలు కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఋణాలు మంజూరు చేసేలా కృషి చేయడంతో పాటు రెండుపడక గదుల మంజూరులో కూడా ప్రాదాన్యతను అందించడం జరుగుతుందని మంత్రి పేర్కోన్నారు.

నిన్న 22 కోట్లు 36 లక్షల ఉపకరణాలను మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా హైదరాబాద్‌లో అందచేయడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమం అనంతరం ధర్మపురి నియోజకవర్గంలోని పెగడపల్లి గొల్లపల్లి ధర్మపురి వెలగటూరు మండలాలకు సంబంధించిన 74 మంది దివ్యంగులకు బ్యాటరి ఆదారిత ట్రైసైకిళ్లను మంత్రి కొప్పుల అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రవి, జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంతం, డిసిఎంఏస్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైరపెర్సన్ సంగి సత్తేమ్మ, ఎంపిపి చిట్టిబాబు, జట్పిటిసి అరుణ, అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -