రాష్ట్ర వ్యాప్తంగా రూ.600 కోట్లు ఖర్చు చేసి 2601 రైతు వేదికలను నిర్మించామని, ప్రపంచంలో ప్రభుత్వం రైతులకు వేదికలు నిర్మించడం తెలంగాణలో మాత్రమే జరిగిందని తెలిపారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈరోజు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రైతు వేదిక, సీసీ రోడ్లు, గౌడ సంఘం భవనం, ముదిరాజ్ సంఘ భవనం, రైతు వేదిక, దాదాపు 33.63 లక్షలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రి. అనంతరం మండలానికి మంజూరు అయిన 119 లబ్ధిదారులకు 1 కోటి 19 లక్షల 13 వేల కళ్యాణం షాదీ ముబారక్ చెక్కు ల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త దాన్ని మనం చూస్తున్నాం. ఇవి దేశంలో ఎక్కడ వెతికిన కనబడదు. ఇటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి రైతాంగాన్ని అన్ని రంగాల్లో ముందుంచి వాళ్లను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకువచ్చినట్లు అయితే తప్పనిసరిగా రాష్ట్రం యొక్క భవిష్యత్ మారిపోతుంది అన్నారు. తెలంగాణ రాకముందు పూర్వం తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్న ఇటువంటి తరుణంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. మహాత్మా గాంధీ చెప్పినటువంటి గ్రామస్వరాజ్యం రావాలంటే పల్లెలు అభివృద్ధి చెందాలని చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా నిజం చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ.
ఈ రోజు ఈ పల్లె ప్రగతి అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో గ్రామాల యొక్క రూపురేఖల్ని మార్చేసింది, ఒక గ్రామంలో ఏం ఉండాలి అవన్నీ కూడా దాదాపుగా గ్రామాలలో ఉన్న ప్రజలందరికీ కావలసినటువంటి అవసరాలకు పరిష్కారం అవుతున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామానికి ఒక వైకుంఠధామం ఉండాలని ఆలోచనలు చేసినటువంటి మహా నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. దేశానికే ఆదర్శవంతంగా మన రైతాంగాన్ని తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని మంత్రి అన్నారు.రైతు సంక్షేమ ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అన్నారు.
గత ఆరు సంవత్సరాలుగా రైతు అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను అందిసుతన్నాయని అన్నారు. నూతన రాష్ట్రం ఏర్పడిన 6 మాసాలో విద్యుత్ సమస్యను అధిగమించి రైతులకు నాణ్యమైన 3 ఫేస్ విద్యుత్ 24 గంటల పాటు ఉచితంగా రైతులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. ప్రతి సంవత్సరం రూ.1200 కోట్లు ఖర్చు చేసి రైతుకు భద్రత కల్పించే దిశగా రైతు బీమా పథకం అమలు చేస్తున్నామని, కరోనా సంక్షోభ సమయంలో సైతం రైతు బంధు పథకానికి కోతలు విధించకుండా 15 వేల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాలో జమ చేసామని మంత్రి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పూర్తి రైతు వ్యతిరేక వైఖరి ఆవలంభిస్తుందని, రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి సీఎం కృషి చేస్తుంటే, నూతన వ్యవసాయ చట్టాలతో కేంద్రం రైతులను గందరగోళానికి గురి చేస్తుందని మంత్రి అన్నారు.కరోనా సంక్షోభ సమయంలో సైతం ప్రజా సంక్షేమ పథకాలకు ఎలాంటి కోత విధించ లేదని కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్, ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలను కొనసాగించామని మంత్రి తెలిపారు. రైతుల కోసం నిర్మించిన రైతు వేదికలను, కల్పిస్తున్న సదుపాయాలను రైతులు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రైతు వేదికల నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు రైతులు హజరుకావాలని, వారి సందేహలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.
రైతు వేదికలను వినియోగించుకుంటూ రైతులు మార్కెట్లో పంట డిమాండ్, గిట్టుబాటు ధర, పంటలు పండించడంలో మెలుకవులు, ఎరువులు, విత్తనాల వినియోగం వంటి వాటిపై చర్చించాలని, మంచి పద్దతులను తెలుసుకొని పాటించాలని సూచించారు. చందోలి గ్రామంలో తెలిసి ఈ పది సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యమంత్రి మనం అడక్కుండానే ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. ఒంటరి మహిళలకు పెన్షన్ వస్తుంది, వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ వస్తుంది, రైతు బీమా వస్తుంది, రైతుకు సంబంధించిన రైతుబంధు వస్తుంది, దాదాపు ఒక గ్రామానికి ఒక కోటి కోటి రూపాయలు ఒక గ్రామానికి ప్రభుత్వం నిధులు వస్తాయి. కల్యాణలక్ష్మి కింద డబ్బులు వస్తున్నాయి. అదే విధంగా మరి మాతా శిశు ప్రోగ్రామ్ కింద ఆడపిల్ల పుడితే 13 వేల రూపాయలు మగబిడ్డ పుడితే 12 వేల రూపాయలు వస్తాయి అన్నారు.
కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో ఒక అవార్డు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలానికి మరియు ధర్మారం మండలానికి రెండు అవార్డులు మనం సొంతంచేసుకోవడం అంటే ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌కి మన అందరి తరపున మంత్రి అభినందనలు తెలియజేయండి. అలాగే గొల్లపల్లి మండలకలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుందని రైతులు తక్కువ ఉన్నారు. ఒకేసారి 119 మందికి కోటి 19 లక్షల 13 వేల రూపాయలు చెక్కులను అందచేయడం జరుగుతుంది.