తెలంగాణ వ్యవసాయరంగం దేశానికి ఆదర్శం-మంత్రి కోప్పుల

187
Koppula Eashwar
- Advertisement -

దేశానికే ఆదర్శం తెలంగాణ వ్యవసాయ రంగం… తెలంగాణ రైతాంగాన్ని ఒక సంఘటిత శక్తిగా మార్చాలన్న లక్ష్యంతోనే రైతు వేదికల నిర్మాణం చేపట్టారని రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అదివారం పాలకుర్తి మండలం పాలకుర్తి గ్రామంలో, కుక్కలగూడుర్‌లో రైతు వేదిక భవనాలను మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రైతంగాన్ని సంఘటిత శక్తిగా మార్చలన్నా లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు వేదికలను నిర్మాణం చేశారన్నారు. దేశంలో రైతువేదికలు నిర్మించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అరవై ఏళ్లలో జరగని అభివృద్ధిని ఆరేళ్లలో చేసి చూపించిన మహనేత కేసీఆర్‌ అన్నారు. దేశంలోనే రైతులకు మెలు కోరేది తెలంగాణ ప్రభుత్వం అన్నారు.

60 శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయరంగం బాగుంటే ఈ సమాజం అంతబాగుంటుందన్నారు.రైతులు తాము పండించిన పంటను రైతు తాను ధర నిర్ణయించుకోవాలంటే రైతులు సంఘటితం కావాలి అన్నది కేసీఆర్ ఆలోచన అన్నారు. రైతుందరిని ఒక్కటి చేసేందుకే రైతువేదికలను నిర్మించి రైతులను ఒకచోటికి తెస్తున్నారు. అన్నంపెట్టే రైతన్నను రాజుగా మార్చలాని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు నిత్యం శ్రమీస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం రంగాన్ని బలోపేతం కోసం రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచిన ఘనత సి.ఎం కేసీఆర్‌ గారికే దక్కుతుందని అన్నారు. ఈ రైతు వేదికల ద్వారా వ్యవసాయంలో మెళకువలు, పంటల విధానం, పంటల సాగుపై రైతువేదికల ద్వారా రైతులకు విజ్ఞానం అందిస్తున్నామన్నారు.

రైతులకువరైతు బంధు రైతు బీమా 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. వ్యవసాయరంగం బలపడాలి, దేశంలో అత్యధిక శాతం ఆధారపడ్డ ప్రజలు బాగుపడాలి అన్న లక్ష్యంతో తెలంగాణ ముందుకు సాగుతుందనీ, ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయ రంగంలో ఇన్ని పథకాలు లేవన్నారు. కఠోరదీక్షతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం నిర్మాణం ఎంతో అద్బుతంగా చెపట్టారు. ఎండిన గోదారికి జీవం పోసిన జల ప్రధాత కేసీఆర్‌ అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆమలు చేయడం జరిగిందని, రైతులకు రైతుబంధు, రైతులు పండించిన పంటల కొనుగోళ్లు చేసింది తెలంగాణ ప్రభుత్వమన్నారు.

దేశంలో ఎ రాష్ట్రం లో లేని విధంగా వృద్దులకు, ఒంటరి మహిళలు, వితంతువు లకు 2 వేల రూపాయలు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లేలన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిపి వాల్వ అనసూర్యరాంరెడ్ది, జడ్పీటిసి కందుల సంద్యారాణి, వైస్ ఎంపిపి ఎర్రం స్వామి,సర్పంచ్ దుర్గం జగన్ కొల లత గొండ్ర చందర్ దుర్గం కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -