మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం..

480
konijeti adinarayana
- Advertisement -

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిచినందుకు గాను విజయవాడ కనుక దుర్గమ్మ గుడిలో కొణిజేటి ఆదినారాయణ 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కొణిజేటి ఆదినారాయణ మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించిన హుజూర్‌నగర్ ప్రజలకు,సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ఏ ఎన్నిక వచ్చిన భారీ మెజార్టీతో గెలిపించాలని విజయవాడ దుర్గమ్మ వారిని కోరుకుంటాను. తెలంగాణలో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగిన టీఆర్‌ఎస్ ఘన విజయం ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి కృప తెలంగాణ ప్రజలకు, సీఎం కేసీఆర్‌కు ఉండాలని అమ్మవారిని కోరుకున్నాను అని అన్నారు.

trs

రానున్న మున్సిపల్ ఎన్నికలలో కూడా టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించాలని దుర్గమ్మను కోరుకున్నాను. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్సే ఘన విజయం సాధిస్తుందిని కొణిజేటి ఆదినారాయణ తెలిపారు.

ఆదినారాయణ తొలి నుంచి కేసీఆర్‌కు వీరాభిమాని. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించాలని ఇంద్రకీలాద్రి వద్ద 101 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక మోకాళ్లపై ఇంద్రకీలాద్రి ఎక్కారు. తాజాగా హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినందుకు మొక్కు తీర్చుకున్నారు.

- Advertisement -