రాష్ట్రంలో కొత్తపార్టీ..?

49
konda
- Advertisement -

బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలకు తెరదించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. త్వరలో తెలంగాణలో కొత్త పార్టీ రాబోతుందని సంకేతాలిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ నాయకత్వం సరిగా లేదని చెప్పారు. తన రాజకీయ ప్రవేశంపై నెల రోజుల్లో నిర్ణయం చెబుతానని చెప్పారు.

త్వరలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కూడా రాష్ట్ర రాజకీయాలపైనే చర్చించానని…ఆయనది తనది ఒకే లక్ష్యం అన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రాంతీయ పార్టీ ఉంటే బాగుండు అనే ఆలోచన చాలా మందిలో ఉందన్నారు.

వాస్తవానికి ఈ నెల 14న కొండా బీజేపీలో చేరడం ఖాయమనే వార్తలు వచ్చాయి. అంతా అదే భావించారు కానీ ఆయన బీజేపీలో చేరేందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది.

- Advertisement -