పాలకుర్తి నుంచి కొండా…జనగాం నుంచి ఎర్రబెల్లి..!

213
konda susmitha patel
- Advertisement -

ముందస్తు ఎన్నికల వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పొలిటికల్ హిట్ పెరిగిపోయింది. అధికార టీఆర్ఎస్ జోగులాంబ గద్వాల నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. గట్టు ఎత్తిపోథల పథకానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ నడిగడ్డ ప్రగతి సభ వేదికగా టీఆర్ఎస్‌ను గెలిపించి బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో ఎప్పటినుంచో సీట్లు ఆశీస్తున్న ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక ప్రధానంగా వరంగల్ జిల్లాలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అన్న దానిపై పుకార్లు షికార్ చేస్తున్నాయి. ప్రధానంగా ఎర్రబెల్లి,కొండా సుస్మితా పటేల్ పోటీ చేసే స్ధానాలపై రోజుకో వార్త చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటివరకు భూపాలపల్లి నుంచి సుస్మితా పటేల్ పోటీ చేయడం ఖాయమంటూ కుండబద్దలు కొట్టారు కొండా దంపతులు. ఇక సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం పాలకుర్తి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

అయితే,తాజాగా సీఎం కేసీఆర్ ఇంటలిజెన్స్ ద్వారా జరిపిన సర్వేలో వీరి స్ధానాల్లో మార్పులు ఖాయమనే సంకేతాలు ఇచ్చారని ప్రచారం సాగుతోంది. భూపాలపల్లి నుంచి సీఎం కేసీఆర్ సన్నిహితుడు,స్పీకర్ మధుసుధనాచారికే సీటు కన్ఫామ్ చేశారని వార్తలు వెలువడుతున్నాయి. భూపాలపల్లి నుంచే సీటు ఆశీంచిన కొండా సుస్మితాపటేల్‌ను పాలకుర్తి నుంచి బరిలోకి దింపుతారని టాక్‌.

ఇక ఇప్పటివరకు పాలకుర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎర్రబెల్లిని జనగాం నుంచి బరిలోకి దిగనున్నారని ఈ మేరకు ఆయన కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఏ మేరకు నిజం ఉందో తెలియదు కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు మాత్రం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

- Advertisement -