ఏపీ సీఎం చంద్రబాబుకు కొండా సురేఖ లేఖ

9
- Advertisement -

టీటీడీ ద‌ర్శ‌నాలపై ఏపీ సీఎం చంద్ర‌బాబుకు లేఖ రాశారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. టీటీడీ అధికారులు తెలంగాణ భ‌క్తుల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డంపై తీవ్ర గందరగోళం నెల‌కొంటుంద‌ని ప్రస్తావించారు మంత్రి సురేఖ.

సీఎం ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదని వెల్లడించారు కొండా సురేఖ. అధికారుల తీరుతో తెలంగాణ ప్రజాప్రతినిధులు, భక్తులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వెల్లడించారు.

ఈ విషయాన్ని వెంటనే ప్ర‌త్యేకంగా పరిశీలించి సీఎం ఆదేశాలను సక్రమంగా పాటించేలా టీటీడీ అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని విజ్ఞ‌ప్తి చేశారు మంత్రి. ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబు సత్వరమే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు మంత్రి కొండా సురేఖ.

Also Read:గద్దర్ సినీ అవార్డులు.. ఎంట్రీల ఆహ్వానం

- Advertisement -