వరంగల్ కాంగ్రెస్‌లో విభేదాలు..కొండా వర్సెస్ ఎమ్మెల్సీ సారయ్య

5
- Advertisement -

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫైర్ అయ్యారు. తాను పార్టీ మారితే రాజీనామా చేసిన.. నీకు దమ్మ్మంటే రిజైన్ చేసి గెలువు అంటూ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యకు సవాల్ విసిరారు.

పోచమ్మ మైదాన్ పోచమ్మ గుడి దారికి వెళ్లే డబ్బాలు అడ్డంగా ఉన్నాయని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తొలగించారు. దీంతో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి డబ్బాలు తొలగించిన చిరు వ్యాపారులను పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాను అని తెలిపారు.

తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని కానీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య లాగా ఇతర పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారలేదని ఆరోపించారు కొండా మురళి. ఒక బీసీ నాయకుడివై ఉండి రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే వారి డబ్బాలు ఎలా తొలగిస్తావని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Also Read:Harish Rao: కాంగ్రెస్ పిట్ట బెదిరింపులకు భయపడం

- Advertisement -