ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీరెడ్డి లీక్స్ ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు పరిశ్రమలో తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదని, అవకాశాలు ఇస్తామని అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆందోళన చేస్తున్నారు శ్రీరెడ్డి. మొదటగా శ్రీరెడ్డి శేఖర్ కమ్ములపై ఆరోపణలు చేశారు. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి వాడినో చిత్ర పరిశ్రమకు, ప్రేక్షకులకు తెలుసని, తనపై అనవసరంగా బురద చల్లాలను చూస్తే కఠిన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.
మరో నటుడు దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్‌తో కలిసి దిగిన ఫోటోను మీడియా వేదికగా విడుదల చేసింది. తాజాగా మరో ప్రముఖ రచయిత కోన వెంకట్ కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అవకాశం ఇప్పిస్తానని చెప్పి తన గెస్ట్ హౌజ్‌లో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె పేర్కొన్నారు. కోన వెంకట్ తనతో చాటింగ్ చేసేవారంటూ మెసేజ్‌ల స్కీన్ షాట్లు పోస్టు చేశారు శ్రీరెడ్డి.
ఈ ఆరోపణలపై తాజాగా ట్విట్టర్ వేదికగా కోన వెంకట్ స్పందించారు. ఓ నటి సీనీ ప్రముఖులతో పాటు నాపై కూడా ఆరోపణలు చేయడం చూసి షాకయ్యాను. ఆమె ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేపట్టి అసలైన నిందితులను శిక్షించాలని కోరుకుంటునన్నారు. అసలు నిజం బయటపడాలి. లీగల్ యాక్షన్ తీసుకుంటాం. పబ్లిసిటీ కోసం సినీ పరిశ్రమను, సినీ ప్రముఖులను వాడుకోవడం చూస్తే జాలేస్తోంది. తెలుగు నటీనటులకు నేనూ మద్దతిస్తాను. గీతాంజలి చిత్రంలోని వారంతా తెలుగు నటీనటుమనులే కదా.! కానీ ఈ ఆరోపణలు నేను సహించలేనని కోన వెంకట్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
It’s really pity that film industry and film personalities have become soft target to many people who are trying to gain cheap publicity… I definitely support taking Telugu artists in our films.. In Geethanjali u find only Telugu artists. But this is unacceptable. I condemn it.
— KONA VENKAT (@konavenkat99) April 11, 2018
I’m shocked with some allegations made by one actress against some film personalities including me.. I demand the government to conduct through police investigation in these allegations and punish whoever are guilty.. Truth must prevail 🙏 legal action follows!!
— KONA VENKAT (@konavenkat99) April 11, 2018