- Advertisement -
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ ఉందన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కోమటిరెడ్డి..బీజేపీ కన్నా రెండు స్థానాలు అధికంగా కాంగ్రెస్ గెల్చుకుంటుందని, మెజారిటీ పార్లమెంట్ స్థానాలు తమ పార్టీకే వస్తాయని దీమా వ్యక్తం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా ఫైట్ జరిగిందన్నారు. మహారాష్ట్ర. యూపీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నదని.. ఈసారి ఎన్నికలు బీజేపీకి అంత ఈజీ కాదని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో భవిష్యత్తును నిర్ణయించే తీర్పు ప్రజలు ఇచ్చారని భావిస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రజలు వైసీపీకి ఓటు వేశారా లేక మార్పు కోరుకుంటున్నారా అన్నది నాలుగో తేదీన తెలుస్తుందని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read:2న ఏపీకి..10న తెలంగాణకు!
- Advertisement -