నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తివేత సందర్భంగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఉత్తమ్ కోసం ఎంతసేపు ఆగాలి అంటూ అలిగి వెళ్లిపోయారు కోమటిరెడ్డి. ఈ సందర్భంగా ఉత్తమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తడానికి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో సాగర్ వెళ్లాల్సి ఉంది మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకే బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్.. 10 గంటల వరకు రాలేదు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్.
తమను ఉదయం 9 గంటలకే ఎయిర్‌పోర్ట్‌కు రావాలని చెప్పి, ఉత్తమ్ 10 గంటల వరకు రాలేదని కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుండి అలిగి వెళ్లిపోయారు. అయితే మంత్రి కోమటిరెడ్డి లేకుండానే నాగార్జున సాగర్‌కు హెలికాప్టర్‌లో బయలుదేరిన మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్… నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నిండుకుండలా మారింది నాగార్జునసాగర్ జలాశయం. దీంతో 18 ఏండ్ల తర్వాత నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు తెరచుకున్నాయి.
Also Read:నిండుకుండలా నాగార్జునసాగర్

