Komatireddy: పార్టీ మార్పుపై క్లారిటీ

60
komatireddy
- Advertisement -

పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కొద్దికాలంగా కోమటిరెడ్డి బీజేపీలో చేరుతారని వార్తలు వస్తుండగా వాటిని ఖండిస్తూనే ఉన్నారు. తాజాగా పార్టీ మార్పుపై మళ్లీ పుకార్లు జరుగుతుండగా వాటిని ఖండించారు వెంకట్ రెడ్డి.తాను పార్టీ మారుతున్నాననే వార్తల్లో ఎటువంటి వాస్తవంలేదని స్పష్టం చేశారు.

నిరాధారమైన వార్తలతో కాంగ్రెస్ పార్టీని నన్ను నమ్ముకున్న వారిని అయోమయంలో పడేయొద్దు అంటూ సూచించారు. పార్టీ మారాలని అనుకుంటే నేను అధికారికంగా ప్రకటిస్తానని కానీ అటువంటి ఆలోచన నాకు లేదు అంటూ స్పష్టంచేశారు.

తన నియోజవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులు కలుస్తున్నాను కాబట్టి పార్టీ మారుతున్నారన్న వార్తలు వచ్చాయని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ థాకరే తోను, రాష్ట్ర కాంగ్రెస్ వ్య్వహారాలపై చర్చించామని..గెలిచే అభ్యర్థులకే పార్టీ టికెట్లు ఇవ్వాలని కోరామని ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -