- Advertisement -
బడాబాబుల భూములు కాపాడేందుకే RRR అలైన్‌మెంట్ మార్చారు మరోసారి మండిపడ్డారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సొంత ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు.
ప్రముఖ కంపెనీలు, బడాబాబుల భూములు కాపాడేందుకే అలైన్‌మెంట్ మార్చారని, RRR భూ నిర్వాసితులు చేస్తున్న ఆరోపణలు నిజమే అన్నారు. ప్రభుత్వంతో కొట్లాడి బాధితులకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను మరోసారి స్పష్టం చేశారు.
గతంలోనూ ఆర్ఆర్ఆర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చేద్దామంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. RRR అలైన్మెంట్ మార్చకపోతే ఈ ప్రభుత్వాన్నే మార్చేద్దాం అని కోమటిరెడ్డి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read:హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- Advertisement -

