ఎల్బీనగర్ నుండి పోటీ చేస్తే నాకు మంత్రి పదవి వచ్చేది… కానీ నా మునుగోడు ప్రజల కోసం నేను మంత్రి పదవి వదులుకున్నాను అన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.తాను పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తానన్నారు, భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించినప్పుడు కూడా మంత్రి పదవి ఇస్తానని చెప్పడం జరిగింది అన్నారు.
మంత్రి పదవి వస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని ప్రజల ఆలోచన… రాజకీయాల్లోకి వచ్చే పదవులను అడ్డుపెట్టుకొని సంపాదించే వాడిని కాదు…నా స్వార్థం కోసం మంత్రి పదవి అడగట్లేదు నాలాంటి వాడికి మంత్రి పదవి వస్తే ఇంకా ఎంతో మంచి సేవా కార్యక్రమాలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు.. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి అభివృద్ధి సంక్షేమ కావాలి అన్నారు.
మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం.. నేను తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉన్నాను పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నాను… వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్లకు పదవులు ఇచ్చారు నాకన్నా చిన్నవారికి పదవులు ఇచ్చారు.. మీరు ఎంపీ గెలిపించుకో అంటే గెలిపించాను…తాను ఎవరి కాళ్లు మొక్కి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు మనసు దిగజార్చుకొని బతకడం నాకు తెలియదు అన్నారు. మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తా మళ్ళీ ఏ త్యాగానికైనా సిద్ధం… అంత దూరమైన పోత… మునుగోడు ప్రజలు తలదించుకునే పని ఏనాడు చేయనని అన్నారు.
Also Read:మహావతార్..హిందీలోనూ అదుర్స్!

