హోంశాఖ అంటే ఇష్టం..కోమటిరెడ్డి మనసులో మాట

4
- Advertisement -

తనకు హోంమంత్రిత్వ శాఖ అంటే ఇష్టమని తన మనసులో మాటను బయటపెట్టారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏ పదవి వచ్చినా సమర్దవంతంగా నిర్వహిస్తా.. ప్రజల పక్షాన నిలబడతానని చెప్పారు.

నిన్న ఢిల్లీలో కేబినెట్ విస్తరణపై చర్చ జరిగిందని తెలిపిన కోమటిరెడ్డి… తనకు ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి అయితే ఫోన్ రాలేదు అని చెప్పారు. అయితే ఈ సారి మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

మంత్రివర్గ విస్తరణ అనంతరం పీసీసీ కార్యవర్గం ప్రకటన, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణలో నలుగురు లేదా ఐదుగురికి చోటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోండగా సామాజిక సమీకరణాలు, జిల్లాలు, నియోజకవర్గాలు, ఎన్నికల ముందు నేతలకు ఇచ్చిన హామీల ఆధారంగా మంత్రుల ఎంపిక ఉంటుందని సమాచారం.

మంత్రివర్గం రేసులో వాకిటి శ్రీహరి, వివేక్, రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, విజయశాంతి, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్, రామచంద్ర నాయక్, అమీర్ అలీఖాన్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.

Also Read:నమస్తే మంత్రిగారు..వివేక్‌తో మల్లారెడ్డి

- Advertisement -