పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఒక్క సినిమా కూడా ఆడనివ్వం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ దిష్టి అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రజలను కించపరిచే విధంగా ఉన్నాయని, అలాంటి మాటలపై పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చిరంజీవి మంచోడు, ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటాడు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఇలా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు” అని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇక మంత్రి వాకిటి శ్రీహరి కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి చూసి పవన్ కళ్యాణ్ ఓర్వలేకపోతున్నారని, అందుకే రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాజకీయ మైలేజ్ కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించిన శ్రీహరి, పవన్ కళ్యాణ్‌కు ఇంకా రాజకీయాల్లో మెచ్యూరిటీ అవసరమని అన్నారు.
తక్షణం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్‌ను మంత్రి శ్రీహరి డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి పై ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, వ్యక్తిగత ప్రచారం కోసం తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయడం అంగీకారయోగ్యం కాదని మంత్రులు స్పష్టం చేశారు.
Also Read:Bihar:స్పీకర్‌గా ప్రేమ్ కుమార్

