GHMC ని సంద‌ర్శించిన KMC బృందం..

294
ghmc
- Advertisement -

మ‌హారాష్ట్రలోని కొల్హాపూర్‌ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు చెందిన మ‌హిళా శిశు సంక్షేమ క‌మిటి కొల్హాపూర్ డిప్యూటి ఛైర్మ‌న్ ఛాయ ఉమేష్ పోవార్ ఆధ్వ‌ర్యంలో ప‌ది మంది స‌భ్యుల బృందం సోమ‌వారం జిహెచ్ఎంసిని సంద‌ర్శించింది. న‌గ‌ర పాల‌న వ్య‌వ‌స్థ తీరుతెన్నులు, మ‌హిళా శిశు సంక్షేమ కార్య‌క్ర‌మాలు, వైద్య స‌దుపాయాలు, అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధుల మ‌ధ్య స‌మ‌న్వ‌యానికి చేసిన ఏర్పాట్లు, స్టాండింగ్ క‌మిటి, స‌ర్వ‌స‌భ్య స‌మావేశాల తీరుతెన్నులు, నిర్ణ‌యాలు, వాటి అమ‌లుకు తీసుకునే చ‌ర్య‌ల గురించి జిహెచ్ఎంసి కార్యాల‌యంలో ఏర్పాటుచేసిన స‌మావేశంలో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా అర్బ‌న్ క‌మ్యునిటి డెవ‌ల‌ప్‌మెంట్ విభాగం ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ సౌజ‌న్య, ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ విజ‌య‌ల‌క్ష్మిలు వివ‌రించారు.

అర్బ‌న్ క‌మ్యునిటి డెవ‌ల‌ప్‌మెంట్ విభాగం ద్వారా మ‌హిళా సాధికారిత‌కు నెల‌కోల్పిన స్వ‌యం స‌హాయ‌క సంఘాలు, స్ల‌మ్‌లేవ‌ల్ ఫెడ‌రేష‌న్లు, టౌన్‌లేవ‌ల్ ఫెడ‌రేష‌న్ల నిర్వ‌హ‌ణ‌, వ‌డ్డీలేని రుణాలు, నైపుణ్య శిక్ష‌ణ‌, ప్లేస్ మెంట్స్‌, దివ్యాంగుల సంక్షేమానికి అంద‌జేస్తున్న సేవ‌లు, వీధి వ్యాపారుల కార్య‌క్ర‌మాలు, నైట్ షెల్ట‌ర్ల నిర్వ‌హ‌ణ త‌దిత‌ర ప్ర‌ధాన అంశాల గురించి వివ‌రించారు. బ‌స్తీ దావ‌ఖానలు, స్వ‌చ్ఛ దూత్‌లు, ఆస‌రా పింఛ‌న్లు త‌దిత‌ర ప‌థ‌కాల గురించి తెలుసుకున్నారు.
అనంత‌రం గోల్నాక స్ల‌మ్ ఫెడ‌రేష‌న్ స‌భ్యులు, ఆ ప్రాంత నివాసుతుల‌తో కొల్హాపూర్ కార్పొరేష‌న్ బృందం చ‌ర్చించింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన్న‌ కొల్హాపూర్ కార్పొరేష‌న్ స‌భ్యుల వివ‌రాలు:

1.Chaya Umesh Powar, Dy-Chairman, WCWC, KMC,
2.Shobha Dhanaji Kawale, Member, WCWC, KMC,
3.Jayashri sachin chavan, Member, WCWC, KMC,
4.Ashwini Arun Baramate, Member, WCWC, KMC,
5. Archana Umesh, Member, WCWC, KMC,
6.Deepa Dilip, Member, WCWC, KMC,
7.manisha Avinash Kumbhar,Member, WCWC, KMC,
8.Tejashri Digambar shinde, Superintendent, KMC
9.Vilas Shamrao Salokhe, Superintendent, KMC
10.Balwant Shamrao Suryavanshi, Ass. Superintendent, KMC

- Advertisement -