తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్సొరేషన్ ఎం.డి గా పనిచేస్తూ, రిటైర్ అయిన ఐజీపీ బి. మల్లా రెడ్డి ఐపీఎస్, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌గా నియమితులై, ఈ రోజు మొదటిసారిగా కార్పొరేషన్‌కి వచ్చిన సందర్భంగా తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్సొరేషన్ చైర్మెన్ కోలేటి దమోదర్ ఆయనను ఆత్మీయంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ రిటైర్డ్ సీఈ ఎన్ గోపాల కృష్ణ, ప్రస్తుత సీఈ టీ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోలేటి దామోదర్ మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎండీగా ఉన్న కాలంలో మల్లారెడ్డి సహాయసహాకారాలు తన బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహించడంలో ఎంతో తోడ్పడ్డాయిని అన్నారు. మల్లారెడ్డి ఎంతో సమర్థుడైన,చురుకైన పోలీస్ అధికారి మాత్రమే కాక ఎంతో గొప్ప మానవతావాది అని, తెలుగు భాషాభిమాని అని.. ఆయన సర్వీస్ మొత్తంలో తెలుగులోనే సంతకం చేయడం అలవాటుగా పెట్టుకున్నారని అన్నారు. దీనిని ప్రభుత్వం కూడా గుర్తించి, ప్రపంచ తెలుగు మహాసభలో ఆయనను సన్మానించడం జరిగిందని కొనియాడారు. మల్లారెడ్డికి మరిన్ని ఉన్నత పదవులు రావాలని కూడా ఆకాంక్షించారు.