కల్నల్ సంతోష్ మృతి పట్ల కోలేటి దామోదర్ దిగ్భ్రాంతి..

357
Koleti Damodar
- Advertisement -

లద్దాఖ్‌లో భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు వీరమరణం చెందడం పట్ల తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చైనా దుందుడుకు చర్యలను ఎదుర్కొనడానికి సింహంలాగా పోరాడి మాతృదేశ రక్షణలో తన ప్రాణాలను త్యాగం చేసిన సంతోష్ బాబు యువతకందరికీ ఆదర్శప్రాయుడని ఆయన కొనియాడారు.

సూర్యాపేట వాసి అయిన కల్నల్ సంతోష్ బాబుకు హైదరాబాద్‌తో కూడా మంచి అనుబంధం వుందని, ఆయన తల్లిదండ్రులు మంజుల,ఉపేందర్ ముషీరాబాద్ గాంధీనగర్‌లో చాలా కాలం నివసించారని, తండ్రి నల్లకుంటలోని దక్కన్ గ్రామీణ బ్యాంకులో పనిచేసి పదవీవిరమణ పొందారని, సంతోష్ బాబు గాంధీ నగర్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చేరారని, ఆ తరువాత సైన్యంలో చేరారని ఆయన పేర్కొన్నారు. పరాక్రమవంతుడైన ఒక వీరసైనికుడిని కన్న ఆ తల్లిదండ్రులు ధన్యులని తెలియజేస్తూ, వారికి తన తీవ్ర సంతాపాన్ని దామోదర్ తెలియజేశారు.

- Advertisement -