విరాట్ కోహ్లి.. అదొక పేరు కాదు.. బ్రాండ్. టీమిండియా కెప్టెన్‌గా, వరల్డ్ క్రికెట్‌లో బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా విరాట్ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. రోజురోజుకూ పెరిగిపోతున్న పాపులారిటీతో కోహ్లి బ్రాండ్‌వాల్యూ ఆకాశాన్ని తాకుతోంది.
ప్రపంచంలోనే అంత్యంత విలువైన అథ్లెట్ల టాప్ 10 జాబితాను ఫోర్బ్స్ తాజాగా ప్రకటించింది. ఇందులో కోహ్లి 14.5 మిలియన్ డాలర్లతో 7వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. క్రికెటర్లలో టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్ ఏకైక క్రికటర్ గా కోహ్లి రికార్డు సృష్టించాడు. విరాట్.. బాస్కెట్ బాల్ ప్లేయర్ స్టీఫెన్ కర్రీ, గోల్ఫ్ స్టార్ రోరీ మెకిల్‌రాయ్, సాకర్ సూపర్‌స్టార్ మెస్సీలను కూడా మించిపోయాడు. ప్రచారాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే ఫోర్బ్స్ పరిగణలోనికి తీసుకుని ఈ జాబితాను విడుదల చేసింది. ఆటకు సంబంధించిన జీతాలు, బోనస్, పెట్టబడుల
టాప్ 10 జాబితా..
1.రోజర్ ఫెదరర్ (37.2 మిలియన్ డాలర్లు)
2. లిబ్రాన్ జేమ్స్ (33.4)
3. ఉసేన్ బోల్ట్ (27)
4. క్రిస్టీనొ రొనాల్డో (21.5)
5. ఫిల్ మెక్లిసన్ (19.6)
6. టైగర్ వుడ్స్ (16.6)
7. విరాట్ కోహ్లీ (14.5)
8. రోరీ మెక్లోరి (13.6)
9. మెస్సి (13.5)
10. స్టీఫ్ కర్రీ (13.4)