దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా టీమిండియా మరియు సౌతాఫ్రికా మధ్య నేడు మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే టీ20 సిరీస్, వన్డే సిరీస్ లు పూర్తయ్యాయి. టీ20 సిరీస్ సమంగా నిలవగా వన్డే సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇక నేడు నుంచి రెండు జట్ల మద్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ కూడా సొంతం చేసుకొని ఘనంగా సౌతాఫ్రికా నుంచి వీడ్కోలు పలకాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు కనీసం టెస్ట్ సిరీస్ అయిన సొంతం చేసుకొని పరువు నిలుపుకోవాలని ప్రోటీస్ జట్టు భావిస్తోంది. దాంతో ఈ టెస్ట్ సిరీస్ ఆసక్తికరంగా మారనుంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. .
వన్డే వరల్డ్ కప్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ఈ ఇద్దరు టీ20, వన్డే సిరీస్ లకు దూరమయ్యారు. ఇక టెస్ట్ సిరీస్ తో తిరిగి ఈ స్టార్ ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తుండడంతో వీరి ప్రదర్శన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మ, మరియు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డ్ లకు చేరువలో ఉన్నారు. సౌతాఫ్రికా గడ్డపై 1000 పూర్తి చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచేందుకు 281 పరుగులు చేయాల్సి ఉంది. మరి ఈ పరుగులు సాధించి కోహ్లీ సఫారీ గడ్డపై హిస్టరీ క్రియేట్ చేస్తాడేమో చూడాలి. అటు రోహిత్ శర్మ కూడా టెస్ట్ ల్లో 4 వేల పరుగులకు చేరువలో ఉన్నాడు. రోహిత్ శర్మ మరో 323 పరుగులు చేస్తే ఈ ఫీట్ అందుకుంటాడు. మరి సఫారీ గడ్డపై జరగనున్న రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు సరికొత్త రికార్డు నమోదు చేస్తారేమో చూడాలి.
Also Read:ఇండియాలో రూ.100 కోట్లు దాటిన ‘డంకీ’