T20 WC:కోహ్లీ, రోహిత్ డౌటే?

49
- Advertisement -

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. అమెరికా వెస్టిండీస్ సముక్తంగా నిర్వహిస్తున్న ఈ వరల్డ్ కప్ లో మొత్తం 20 జట్లు పాల్గొంటుండగా నాలుగు గ్రూపులుగా తలపడనున్నాయి. టీమిండియా గ్రూప్ ఏ లో స్థానం దక్కించుకుంది. ఇక అందరూ ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పుడు అందరి చూపు జట్టు కూర్పు పైనే పడింది. ప్రస్తుతం పొట్టి ఫార్మాట్ లో టీమిండియా యువ ఆటగాళ్లు అద్బుతంగా రాణిస్తున్నారు. యశస్వి జైస్వాల్, రింకూ సింగ్ భీకర బ్యాటింగ్ తో ఈ వరల్డ్ కప్ లో చెలరేగే అవకాశం ఉంది. గత కొంత కాలంగా టీ20 లలో వీరి ఆటతీరు అత్యుత్తమంగా ఉంది. ఇక టీ20 నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఈ సారి కీలకంగా మారే అవకాశం ఉంది.

ఇంకా కే‌ఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్.. ఇలా టీ20 లలో అద్భుతంగా రాణించే ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఇంకా హర్ధిక్ పాండ్యా కూడా ఆ సమయానికి జట్టులో స్థానం సంపాదించుకునే అవకాశం ఉంది. అయితే ఎంతమంది ఆటగాళ్లు ఉన్న అందరి చూపు మాత్రం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పైనే ఉంటుంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా ఈ ఇద్దరు ఆటగాళ్లు టీ20 లకు దూరంగా ఉంటున్నారు. అందువల్ల ఈసారి జరిగే టీ20 వరల్డ్ కప్ ఈ ఇద్దరు ఆడతారా ? లేదా అనే సందేహాలు వ్యక్తమౌతు వస్తున్నాయి. సెలక్టర్లు కూడా ఇప్పటికే వారితో చర్చలు జరుపుతున్నట్లు క్రీడా వర్గల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నెల అఫ్గానిస్తాన్ తో మూడు టీ20 మ్యాచ్ లు అడనుంది టీమిండియా. ఈ సిరీస్ కు కోహ్లీ, రోహిత్ ఎంపికైతే టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉందని, లేదంటే ఆ ఇద్దరు టీ20 కప్ కు దూరంగానే ఉండవచ్చనేది కొందరి క్రీడా విశ్లేషకుల అభిప్రాయం.

Also Read:KTR:సంక్షేమ పథకాల రద్దుకు కుట్ర

- Advertisement -