టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియా

364
india vs westindies
- Advertisement -

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్ తో జరిగే తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ముమ్మర సాధన చేశాయి. పేసర్లు మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ తుది జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు భాగ్యనగర వాసులు భారీగా తరలివచ్చారు. టీమిండియాకు మద్దతుగా నినాదాలు చేస్తూ కేరింతలతో సందడి చేస్తున్నారు.

భారత జట్టు: రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజువేంద్ర చాహల్

వెస్టిండీస్ జట్టు: లెండిల్ సిమన్స్, ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, హెట్‌మైర్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), దినేశ్ రాందిన్(వికెట్ కీపర్), జాసన్ హోల్డర్, హేడెన్ వాల్ష్, షెల్డన్ కాట్రెల్, కేస్రిక్ విలియమ్స్, ఖ్యారీ పిర్రే

- Advertisement -