భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి అరుదైన ఘనత దక్కింది. ఇంగ్లండ్‌పై మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు గెలిచిన కోహ్లి ప్రఖ్యాత విజ్డెన్ పత్రిక తన కవర్‌పేజీపై విరాట్ ముఖ చిత్రాన్ని ప్రచురించింది. ముంబైలో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా కోహ్లీ కొట్టిన రివర్స్ స్వీప్ షాట్ ఈ పుస్తకంపై కనబడుతుంది. ఈ మ్యాచ్‌లో ఈ ఢిల్లీ ప్లేయర్ టెస్టు కెరీర్‌లో అత్యధిక స్కోరు (235) సాధించిన సంగతి తెలిసిందే.
విరాట్ ఆటలో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చాడని విజ్డెన్ ఎడిటర్ లారెన్స్ బూత్ అన్నారు. కోహ్లీ సరికొత్త అధునిక క్రికెటర్ అనే నిజాన్ని అందరూ గుర్తించాలి. కవర్‌పేజీపై అతని ఫొటోను ప్రచురించేందుకు ఇదే సరైన సమయం. క్రికెట్‌లో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. దాన్ని ప్రతిబింబించేలా చేయాలంటే విరాట్ ముఖ చిత్రం ఉండటమే సరైంది అని బూత్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 10 మంది అంతర్జాతీయ క్రికెటర్లకు మాత్రమే ఈ అవకాశం దక్కింది.