టీమిండియా కెప్టెన్‌కి విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మనే అర్హుడని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు అనంతరం కోహ్లీ స్వదేశానికి రానుండటంతో మిగితా టెస్టులకు రోహిత్ శర్మకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సూచించాడు.
కెప్టెన్‌గా నిరూపించుకోవడానికి రోహిత్ శర్మకి ఆస్ట్రేలియా పర్యటన చక్కటి అవకాశం. నేనే కాదు.. ప్రపంచం మొత్తం రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్సీ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒకవేళ అతను క్లిక్ అయితే..? అప్పుడు కెప్టెన్సీ విభజనపై చర్చకి సార్థకత చేకూరుతుంది’’ అని అక్తర్ వెల్లడించాడు.
డిసెంబరు 17 నుంచి 21 వరకూ అడిలైడ్ వేదికగా మొదటి టెస్టు జరగనుంది. కోహ్లీ భార్య అనుష్క శర్మ జనవరిలో బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో ఆ టెస్టు మ్యాచ్ ఆడేసి భారత్‌కి వచ్చేయనున్నాడు కోహ్లీ. వైస్ కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానె మిగిలిన మూడు టెస్టులకి నాయకత్వం వహించనున్నారు. ఈ నేపథ్యంలో షోయబ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.