Kohli:జెమీమా పోరాటం అద్భుతం

7
- Advertisement -

మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది టీమిండియా. ఆసీస్ విధించిన భారీ టార్గెట్‌ను చేధించింది టీమిండియా. ఇక జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించింది జెమీమా రోడ్రిగ్స్. దేశవ్యాప్తంగా ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విజయంపై విరాట్‌ కోహ్లీ స్పందించారు. భారత జట్టు ఆసీస్‌పై అద్భుత విజయం సాధించిందని కొనియాడారు. జెమీమా ప్రదర్శనను ప్రశంసించారు. ఆస్ట్రేలియా లాంటి బలమైన ప్రత్యర్థిపై మన జట్టు అద్భుతమైన విజయం సాధించింది. ఈ బిగ్‌ గేమ్‌లో జెమీమా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడింది అన్నారు.

ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసానికి ఇది నిజమైన ప్రతిరూపం. వెల్‌డన్‌, టీమ్‌ ఇండియా. జెమీమా రోడ్రిగ్స్‌ 134 బంతుల్లో 14 ఫోర్లతో 127 నాటౌట్‌గా నిలిచారు.

Also Read:గ్రామీణ యాక్షన్ డ్రామా…కరుప్పు!

- Advertisement -