మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ వీళ్ళే!

31
- Advertisement -

వరల్డ్ క్రికెట్ లో సత్తా చాటిన చాటుతున్న ఆటగాళ్ల జాబితా చాలానే ఉంది. కానీ టెస్ట్ లలో సత్తా చాటితే వన్డేలలో నిరాశ పరుస్తుంటారు. మరికొందరు వన్డేలలో రాణిస్తే టెస్ట్ లలో విఫలం అవుతుంటారు. ఇంకొందరైతే కేవలం టీ20 మ్యాచ్ లకే పరిమితంగా నిలుస్తుంటారు. కానీ మూడు ఫార్మాట్లలో సత్తా చాటే ఆటగాళ్లు చాలా తక్కువ. అది కూడా మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ గా నిలవడం అంటే మామూలు విషయం కాదు. కాని కొందరు ఆటగాళ్లు మూడింట్లోను నెంబర్ వన్ నిలిచి వారికి వారే సాటి అని నిరూపించుకున్నారు. వారిలో టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. 2013 లో టెస్ట్ మ్యాచ్ ల్లోనూ, వన్డేల్లోనూ, టీ20 లోనూ నెంబర్ ఒన్ బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. 2018 లోనూ ఇదే ర్యాంకింగ్స్ ను సొంతం చేసుకున్నాడు.

ఓవరాల్ గా మూడు ఫార్మాట్ లలోనూ నెంబర్ ఒన్ గా నిలిచిన ఏకైక భారత ఆటగాడిగా కోహ్లీ ఉన్నాడు. ఆ తరువాత బౌలర్ల జాబితాలో బుమ్రా ఆ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ లో సత్తా చాటిన బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచాడు. ఇక వన్డేల్లోనూ టీ20లోనూ 2022 లో బుమ్రా నెంబర్ వన్ బౌలర్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలో నెంబర్ ఒన్ స్థానాన్ని చేరుకున్న ఇండియన్ బౌలర్ బుమ్రా ఒక్కడే. ఇక విదేశీ ప్లేయర్ల జాబితాలో హేడెన్, రికీ పాంటింగ్ మాత్రమే మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ గా నిలిచిన బ్యాట్స్ మెన్ ల జాబితాలో ఉన్నారు. జట్ల విషయానికొస్తే టీమిండియా గత సంవత్సరం మూడు ఫార్మాట్లలోను నెంబర్ వన్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Also Read:Rajini:లాల్ సలామ్‌ ట్రైలర్

- Advertisement -