కోహ్లీ ఫ్యూచర్ ఐపీఎల్ పైనే ఆధారపడిందా?

175
- Advertisement -

టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెబుతాడానే వార్తలు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2019 వరల్డ్ కప్ తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని కోహ్లీ వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ ఆడతాడా ? లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీ20లకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనే టాక్ నదించింది. అయితే కెప్టెన్ గా రోహిత్ శర్మకు మంచి రికార్డ్స్ ఉన్న కారణంగా ఈ టీ20 వరల్డ్ కప్ రోహిత్ శర్మ ఉండాలని బీసీసీఐ ప్రతిపాధించినట్లు సమాచారం. అందుకు హిట్ మ్యాన్ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఈ వరల్డ్ కప్ ఆడే తక్కువ అంటున్నారు విశ్లేషకులు.

ఎందుకంటే యంగ్ ప్లేయర్స్ టీ20 లలో అద్భుతంగా రాణిస్తుండడంతో కోహ్లీ స్థానానికి యసరు పడింది. మూడో స్థానంలో ఆడే కోహ్లీ కన్సిస్టెంట్ గా రాణించగలడు.. భారీ షాట్లు ఆడడంలో మాత్రం కొంత తడబాటుకు గురి అవుతూవుంటాడు. అందుకే మూడో స్థానంలో దూకుడైన ప్లేయర్ ను బరిలో దించే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రీడావిభాగంలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇషాన్ కిషన్ మూడో స్థానంలో రాణించే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ ను బట్టి టీ20 వరల్డ్ కప్ కు విరాట్ ఎంపిక ఉండే అవకాశం ఉంది. ఐపీఎల్ లో మెరుగ్గా రాణిస్తే కోహ్లీ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు. కానీ ఐపీఎల్ లో నిరాశపరిస్తే వరల్డ్ కప్ ఆడటం కష్టమే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. దీంతో క్రికెట్ రారాజు గా పేరొందిన విరాట్ కోహ్లీ కెరియర్ మెల్లగా చివరి దశకు చేరుకుందా డిస్సపాయింట్ అవుతున్నారు అభిమానులు.

Also Read:రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -