కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన కోహ్లి

255
Kohli emulates Ponting
- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డుల పరంపర కొనసాగుతోంది.  వరుస సిరీస్ విజయాలతో కోహ్లి సేన ఉరకలెత్తుతోంది. వరుసగా ఆరో సిరీస్‌ విజయంతో టీమిండియా రిఆర్డు సృష్టించింది.  క్రికెట్ చరిత్రలో వరుసగా నాలుగు సిరీస్ లలో నాలుగు డబుల్ సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్ మన్ గా విరాట్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో బ్రాడ్ మన్, ద్రవిడ్ లాంటి దిగ్గజాలను విరాట్ అధిగమించాడు కోహ్లి.

ఇక బంగ్లాదేశ్‌ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో విజయంతో మరో ఘనత అతడి ఖాతాలో చేరింది. మహ్మద్ అజారుద్దీన్ రికార్డును అధిగమించాడు. కెప్టెన్ గా కోహ్లి 15వ విజయం సాధించడంతో ఈ రికార్డు తన పేరిట చేరింది. ఎంఎస్‌ ధోని, గంగూలీ తర్వాత విజయవంతమైన మూడో భారత కెప్టెన్ గా అతడు నిలిచాడు.

కోహ్లి ఇప్పటివరకు 23 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ 23 మ్యాచ్ లను పరిగణనలోకి తీసుకుంటే భారత కెప్టెన్లలో కోహ్లి ఉత్తమ నాయకుడిగా ఖ్యాతికెక్కాడు. ఓవరాల్ గా సెకండ్ బెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. స్టీవ్ వా ముందున్నాడు. 23 టెస్టుల్లో అతడు 15 విజయాలు అందించాడు. రెండిటిలో టీమిండియా ఓడింది. 6 డ్రా అయ్యాయి. స్టీవ్ వా 17 విజయాలు విజయాలు అందించాడు

కోహ్లి టెస్ట్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి… శ్రీలంకపై 2-1, దక్షిణాఫ్రికాపై 3-0, వెస్టిండీస్‌పై 2-0, న్యూజిలాండ్‌పై 3-0, ఇంగ్లండ్‌పై 4-0 తేడాతో భారత్‌ సిరీస్‌లు దక్కించుకుంది. హైదరాబాద్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌మ్యాచ్‌లోనూ గెలుపొంది వరుసగా ఆరో టెస్ట్‌ సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.

- Advertisement -